![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -111 లో... శ్రీలతని రామలక్ష్మి భోజనం చెయ్యడానికి ఒప్పించి తీసుకొని వస్తుంది. దాంతో సీతాకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మకి నీపై ధనపై కోపం ఉండదని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో చూస్తూ.. ఈ జన్మ లో కూడా నాతో నువ్వు ఉండే అదృష్టం నాకు లేదని సీతాకాంత్ ఫీల్ అవుతాడు.
అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు తాతయ్య కంట్లో నలుసు పడిందని సీతాకాంత్ అనగానే.. ఆ నలుసు ఇదేనా అని రామలక్ష్మి, సీతాకాంత్ అగ్రిమెంట్ మ్యారేజ్ డాక్యుమెంట్స్ చూపిస్తాడు. అది చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. నువ్వు రామలక్ష్మిని ప్రేమించావు కదా అని పెద్దాయన అంటాడు. కానీ తను నన్ను ప్రేమించలేదు కదా తాతయ్య.. అందుకే సిరి, ధనల కోసం నటించమని చెప్పానని సీతాకాంత్ చెప్తాడు. ఇప్పుడు రామలక్ష్మి జీవితంలో అభి లేడు కదా.. మరి నువ్వు ప్రేమించిన నీ రామలక్ష్మిని నువు ఎందుకు వదులుకోవాలి.. నీ మనసులోని ప్రేమని ఎందుకు చంపుకోవాలని పెద్దయన అంటాడు. రామలక్ష్మి నా జీవితంలోకి అతిథిలాగా వచ్చిందని అంటుంది.. వెళ్ళిపోతాననే వాళ్లని ఉండమని ఎలా అడుగుతానని సీతాకాంత్ అంటాడు. మరుసటిరోజు సీతాకాంత్ రెడీ అవుతూ.. రామలక్ష్మి వచ్చినట్లు ఉహించుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి నిజంగానే వచ్చినా ఉహ అనుకోని పట్టించుకోకుండా వెళ్తే.. సర్ ఆగండి అని చెయ్యి పట్టుకుంటుంది. ఏదో టెన్షన్ లో ఉండి పట్టించుకోలేదని చెప్తాడు. అదంతా పైనుండి పెద్దాయన చూసి.. నీ ప్రేమ గురించి రామలక్ష్మికి చెప్తానని అనుకుంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి మాణిక్యం వెళ్లి.. మొన్న అభి మిస్ అయ్యాడు. అదే రోజు నా కూతురు ఏడ్చింది.. ఏదో జరిగిందనిపిస్తుంది.. ఏదైనా దాస్తున్నారా అని మాణిక్యం అడుగుతాడు. అదేం లేదని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత పెద్దాయన ఆఫీస్ కి వచ్చి రామలక్ష్మిని సీతాకాంత్ ప్రేమిస్తున్నాడని.. నేనే చెప్తానని వెళ్లేసరికి రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వెళ్తాడు. అభిగాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని మాణిక్యం అడుగుతాడు. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకని చెప్పాను కదా అని అంటాడు. మా అమ్మని భోజనం చెయ్యడానికి ఒప్పించి నన్ను హ్యాపీగా చేసావ్.. నీకేం కావాలని సీతాకాంత్ అడుగుతాడు. రామలక్ష్మి జోక్ గా పది కోట్లు.. అని అనగానే ఆలోచించకుండా చెక్ పై రాస్తుంటే అయ్యో జోక్ చేసానని రామలక్ష్మి అంటుంది. నువ్వు అడగడమే నాకు అదృష్టం.. ఏం కావాలని అడుగగానే.. పానీపూరి కావాలని రామలక్ష్మి అంటుంది. అప్పుడే సిరి వచ్చి నాక్కూడా అని అంటుంది. కాసేపటికి రామలక్ష్మి, సీతాకాంత్, సిరిలు పానీపూరి తినడానికి బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |